– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బలరాం నాయక్ భారీ మెజార్టీతో గెలవడం పట్ల మండల వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి సంబరాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. మంగళవారం పార్టీ నేతలతో కలిసి టపాసులు కాల్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మహబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి శ్రీను కొంపల్లి శ్రీశైలం యాదవ్ మద్ది రాజు కిషన్ జగదీష్ సుధీర్ పెరుమాండ్ల శంకర్ అశోక్ భాస్కర్ తోపాటు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.