మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ జన్మదిన వేడుకలు 

– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి 

– మాజీ జెడ్పిటిసిహెచ్ వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – నెల్లికుదురు
మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలరాం నాయక్ గతంలో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఎంతోమందికి చేయూతనిచ్చిన ఘనదానికి దక్కిందని అన్నారు ఎంతో మంది పేద కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరిచాడని అన్నారు. అంతేకాకుండా విద్య వైద్య ఉద్యోగ వ్యవసాయ రోడ్లు భవనాలు అభివృద్ధి లక్ష్యంగా ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. అందుకనే మళ్లీ అతనినీ ఎంపీగా గెలిపించారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం రాష్ట్ర కన్వీనర్   పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ గ్రామ అధ్యక్షులు రత్నపురం యాకయ్య మండల నాయకులు నరేష్ గంజి గోవర్ధన్ ఎండి మౌలానా సతీష్ మల్లేష్ వరి పెళ్లి ఉప్పలయ్య జిలకర యాలాద్రి యాకూబ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఎస్కే అజ్గర్ అలీ సట్ల  యాకయ్య  మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్  గుండ్ల పెళ్లి  యాకయ్య  తోట యాకయ్య బొల్లు లింగమూర్తి  మంగీలాల్  బిచ్చ నాయక్  సోమయ్య భూతరాజు శ్రీను బల్లేపల్లి సతీష్ నల్ల మాస శ్రీనివాస్ లక్కీ హెచ్ మల్లేష్ గుగులోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love