
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీటిని వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తన చాంబర్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు, విద్యార్థులకు దుస్తుల పంపిణీ పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని,విద్యార్థులకు దుస్తుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అన్ని పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, ఎలక్ట్రికల్ వంటి మరమ్మతు పనులను చేపట్టడం జరిగిందని, వీటన్నిటిని ఇక జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, మిషన్ భగీరథ ఎస్ఈ డి. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.