
జిల్లాలలో పెండింగ్ ధరణి భూ సమస్యల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సి.సి.ఎల్.ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం పెండింగ్ ధరణి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్, ఆదనవు కలెక్టర్ లతో హైద్రాబాద్ నుండి ముందుగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, అలాగే సూర్యాపేట కలెక్టర్ల తో నిర్వహించిన వీడియో కన్ఫెరెన్సు లో ఉన్నతాధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల వారీగా పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిశీలన తదుపరి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కలెక్టర్, ఆర్.డి.ఓలు అలాగే తహశీల్దార్ల పరిధిలో గల దరఖాస్తులు పరిశీలన తదుపరి వేగవంతం చేయాలని సూచించారు.తదుపరి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ రకాల భూసమస్యల పెండింగ్ ధరణి దరఖాస్తులు 7093 ఉన్నాయని అట్టి వాటిని పది రోజుల్లో పరిష్కరిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆర్.డి.ఓ వేణు మాధవ్, తహశీల్దార్లు శ్యామ్ సుందర్ రెడ్డి, కృష్ణయ్య, సంఘ మిత్ర, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.