నవతెలంగాణ – డిచ్ పల్లి
నూతన విద్యా సంవత్సరం సందర్భంగా డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థులకు, ప్రభుత్వం ద్యారా వచ్చిన నూతన పాఠ్యపుస్తకాలను అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ రాజశశికళ, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి లచ్చమొల్ల దత్తాద్రి ప్రధానోపాధ్యాయులు కొండ గోవర్ధన్ స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదని గ్రామానికి పేరు ప్రఖ్యాతులు పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైన అధ్యాపకులచే విద్య బోధన చేయిస్తుందని, ఇదే కాకుండా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అన్నింటిని సమకూరుస్తుందని ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు సక్కెర్ల పెద్ద రాజన్న, ఈదుల నర్సా గౌడ్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.