బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి

– ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్‌
బడీడు పిల్లందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ అన్నారు. శుక్రవారం తలకొండపల్లి మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా పాఠశాలలో విద్యాభ్యాసం కోసం అడుగు పెట్టిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ మాట్లాడుతూ తమ పాఠశాల ప్రత్యేక తల్లిదండ్రులకు వివరిస్తూ, ప్రభుత్వం పాఠశాలలో ఒత్తిడి లేని చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుందన్నారు. తమ పిల్లల భవిష్యత్‌ కోసం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం బోధన, విద్యా ర్హతలు ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులతోనే బోధించనున్నట్టు తెలిపారు. విశాలమైన ఆటస్థలం, ప్రతి రోజూ వ్యాయామ, యోగా, ఆటాపాటలు ఉంటాయని తెలి పారు. ఉపన్యాసాలతో పాటు జాతీయ నాయకుల జయంతి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రేరణ కలుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వం యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌తోపాటు మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌ రీత్యా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూపతి నాయక్‌, బలరాం, అంగన్‌వాడీ టీచర్‌ నిర్మల, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మెన్‌ పద్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, విద్యార్థులు తల్లిదండ్రులు కాలే శేఖర్‌, మల్లయ్య, ప్రెమలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love