– తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్
– మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ
– ప్రజల ఫిర్యాదు చేసినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం
– అధికారులు వెంటనే కదిలి అక్రమార్కుల భరతం పట్టాలని డిమాండ్
నవతెలంగాణ-శంషాబాద్
అంతర్జాతీయ విమానాశ్రయానికి కూత వేట దూరం లో ఉన్న అమ్మపల్లి గ్రామ రెవెన్యూలో (భూ కబ్జాలపై) ఆక్ర మణలకు గురైన ప్రభుత్వ సీలింగ్ భూములపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమ్మరి నర్సింహ డిమాండ్ చేశారు. అమ్మపల్లి గ్రామ రెవెన్యూలో ప్రభుత్వ సీలింగ్ భూమి కబ్జా అవుతున్న విషయంపై శంషాబాద్ తహసీల్దార్, రాజేంద్ర నగర్ ఆర్డిఓకు స్థానికప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినా మీడియాలో కథనాలు వచ్చినా స్పందించకపోవడంలో మ తలబు ఏమిటని ప్రశ్నించారు.శుక్రవారం ఆయన అమ్మపల్లి రెవెన్యూ జరుగుతున్న భూ ఆక్రమణలపై మీడియా సమా వేశంలో వెల్లడించారు. శంషాబాద్ మండలంలోని అమ్మ పల్లి గ్రామ రెవెన్యూలో 724 ఎకరాల భూమి ఉందన్నారు. ఇదికాక ప్రత్యేకంగా ప్రభుత్వ భూమి 30 ఎకరాలకు పైనే ఉంటదని తెలిపారు. ఈ భూమిలో అమ్మపల్లి శ్రీ సీతారా మచంద్రస్వామి దేవాలయం పేరున 224.25 ఎకరాలు ఉందన్నారు. అయితే భూస్వాములు నుంచి 19 సర్వే నెం బర్లో 501 ఎకరాలు ప్రభుత్వం మిగులు భూమి కింద స్వాధీనం చేసుకొని సర్ప్లస్ సీలింగ్‌లో ఉంచిందన్నారు. కొంత భూమి ఓయాసిస్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సర్వేనెంబర్ 19లో ఉన్న 19/16, 19/ 18,19/21, 19/23, 19/25, 19/27 నుంచి 19/47 వరకు 1993లో ల్యాండ్ యాక్వేషన్ చట్టం ప్రకారం సర్పలస్ సీలింగ్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ భూమిలో కొందరు అక్రమంగా చొరబడి తప్పుడు పత్రా లు సష్టించి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందినట్లు తెలు స్తోందన్నారు. సుమారు 100 ఎకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుందని తెలిపారు. ఈ వ్యవహారంలో పొన్నాల లక్ష్మ య్య, దానం నాగేందర్‌తో పాటు మరికొంతమంది పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయని తెలిపారు. 19/16/అని /2, అండ్ 19/18/ఆ/2 లో తాండూరు వాగ్దేవి రెడ్డి మహిళ పేరు మీద సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ 4- 30 ఎకరాల భూమి పట్టగా ఎలా మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వ భూమి ప్రయివేటు వ్యక్తులు ఎలా పట్టగా మార్చుకున్నా రనే విషయం ఆందోళన కలిగిస్తుందన్నారు. తహసీల్దార్ ఆ భూమి ఎవరిది అనే విషయాన్ని చెప్పాలన్నారు. రాజేంద్రన గర్ నియోజకవర్గం హిమాయత్‌సాగర్ ఆవల ఎకరం భూ మి 100 కోట్లు ధర పలుకుతుందన్నదన్నారు. దానికి అ నుకొని ఉన్న శంషాబాద్ మండలంలో కనీసం పావుల వంతు అయిన ధర పలికే అవకాశం ఉందన్నారు. శంషా బాద్‌లోని అమ్మపల్లి రెవెన్యూ భూములు అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉన్నాయ ని తెలిపారు. సుమారు ఎకరం 10 కోట్లు పైధర పలికే ఈ భూములను కాపాడడంలో స్థానిక రెవె న్యూ అధికా రులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిం చారు. స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన అధికారుల మౌనం వెనుక మర్మం ఏమిటో చెప్పాలన్నారు. రెవెన్యూ అధికారుల ఉదాసీనత కారణంగా సీలింగ్ భూముల్లో పెద్ద ఎత్తున ప్రహరీ గోడలు, భవంతులు నిర్మిస్తున్నారని తెలి పారు. ఈ భూముల వ్యవహారంపై తాను రాజేంద్రనగర్ ఆర్డీఓ, శంషాబాద్ తహసీల్దార్‌ను ఫోన్ ద్వారా సంప్రదిం చారని చెప్పారు. దీనికి ఆర్డీఓ స్పందిస్తూ ఈ భూముల సమస్యపై తక్ష ణమే విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యా చరణ చేపడ తామని హెచ్చ రించారు. మీడి యా ప్రతిని ధులు తహసీ ల్దారును వివరణ కోరితే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వ్యక్తులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు సమర్పించాలని చెప్పామన్నారు అయితే వారు కొంత సమయం అడిగారని తెలిపారు. వారి దగ్గర ఉన్న డాక్యు మెంట్లు అందిన వెంటనే పూర్తి సమా చారం వెల్లడి స్తామని తెలిపారు.