ఈ నెల 19 న మెగా జాబ్ మేళా మంత్రివర్యులు, ములుగు శాసన సభ్యురాలు సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం తో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పసర ఎస్సై కమలాకర్ సోమవారం ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియచేయడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా కు 7 వ తరగతి నుండి పైకి అన్నిరకాల విద్యార్హతలు కలిగిన వారు హాజరు కావొచ్చు. అభ్యర్థుల అర్హతను బట్టి, నైపుణ్యాలను బట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ మెగా జాబ్ మేళా లో దాదాపుగా 50 కి పైగా కంపెనీ లు రానున్నాయి. కావున మండలం లోని అన్ని గ్రామాల్లోని యువతి యువకులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకొనవల్సిందిగా ఎస్సై గారు తెలిపారు.
మెగా జాబ్ మేళా వివరాలు:
తేదీ: 19.06.2024 స్థలం : యం ఆర్ ఫంక్షన్ హాల్, ఇంచర్ల. అభ్యర్థులు తమ అన్ని విద్యార్హత ధ్రువ పత్రాలు, ఇతరత్రా సర్టిఫికెట్స్ అన్నింటితో పైన తెలిపిన తేదీలో హాజరు కాగలరు