నవతెలంగాణ-హైదరాబాద్ : సోషల్ ఓ భయంకరమైన వీడియో వైరల్ అవుతుంది. ఓ మెస్‌లో గ్యాస్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.ఈ ఘటనకు సంభందించిన వీడియో వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ మెస్‌లో వంట చేస్తుండగా.. గ్యాస్ సిలిండర్ పైపు స్టవ్ నుంచి ఊడిపోయింది. పైపు నుంచి గ్యాస్ లీక్ అవుతూ పాములా స్పీడుగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. పైపును పట్టుకుని గ్యాస్ సిలిండర్‌తో సహా బయటకు తీసుకువచ్చింది. అయినా గ్యాస్ లీక్ అవ్వటం ఆగలేదు. సిలిండర్‌ను వంట గదినుంచి బయటకు తీసుకురాగానే.. భయంతో దాన్ని అక్కడే పడేసి బయటకు పారిపోయింది. గ్యాస్ మొత్తం లీక్ అయిపోయిన తర్వాత మరో డోరు నుంచి అక్కడి వచ్చింది.
అక్కడే ఉన్న ఓ వ్యక్తికి విషయం చెప్పింది. ఆ వ్యక్తి, ఆ మహిళ గ్యాస్ సిలిండర్ దగ్గరకు వచ్చారు. సిలిండర్‌ను పైకి ఎత్తుతూ ఉన్నారు. ఇంతలోనే అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద మంట వంటగదిలోంచి బయటకు వచ్చింది. బయట ఉన్న గ్యాస్ కూడా మండుకుంది. బాంబు పేలినట్లు పేలింది. కొన్ని సెకన్ల పాటు మంటలు చెలరేగాయి. సీసీ కెమెరాలకు క్లియర్ వ్యూవ్ వచ్చే సమయానికి ఆ వ్యక్తి అక్కడ లేడు. మహిళ మాత్రం అక్కడినుంచి భయంతో పరుగులు తీసింది.
ఆమె చీర మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయినట్లు తెలుస్తోంది. మెస్ తలుపులు, కిటీకీలు తెరిచి ఉన్నాయి. సగానికి పైగా గ్యాస్ బయటకు వెళ్లిపోయింది. లేదంటే.. పేలుడు తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. ఇద్దరి ప్రాణాలు పోయేవి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు వాళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.