నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలి

– మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఇందిరా భవన్‌లో మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశానంతరం బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ విషయంలో బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టినట్టే.. నీట్‌ విషయంలో బీజేపీని బొంద బెట్టుడు ఖాయమని హెచ్చరించారు. నీట్‌ విషయంలో విద్యార్థులకు న్యాయం చేయకపోతే పార్లమెంట్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Spread the love