మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కాలేజీలో సాంకేతిక సమస్య

– ఆ అభ్యర్థులకు మళ్లీ పరీక్ష : టీజీపీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలో 581 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వార్డెన్‌, మ్యాట్రన్‌, మహిళా సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి సోమవారం నుంచి కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షలు (సీబీఆర్టీ) విధానంలో రాతపరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 29 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఉదయం విడత రాతపరీక్ష నిర్వహణలో కొంత సాంకేతిక సమస్య వచ్చిందని తెలిపారు. దీంతో కొందరు అభ్యర్థులు పరీక్షను రాయలేకపోయారని పేర్కొన్నారు. వారికి తిరిగి పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్ష తేదీ, సమయాన్ని అభ్యర్థులకు ఈమెయిల్‌/ఎస్‌ఎంఎస్‌ ద్వారా తర్వాత సమాచారాన్ని తెలియజేస్తామని వివరించారు.

Spread the love