వెబ్‌సైట్‌లో ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా :టీజీపీఎస్సీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఏఈఈ) మెకానికల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన ప్రొవిజినల్‌ జాబితా వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) వెల్లడించింది. ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 163 పోస్టుల భర్తీ కోసం 2022, సెప్టెంబర్‌ మూడో తేదీన ఏఈఈ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Spread the love