Wednesday, June 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జూలైలో 13 రోజులు బ్యాంకు సెలవులు..

జూలైలో 13 రోజులు బ్యాంకు సెలవులు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రతి నెల ప్రారంభానికి ముందు బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. దీని ప్రకారం ఈసారి జూలై నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా నగరంలో, ఏ కారణంతో బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకోవచ్చు.

జూలై 2025లో బ్యాంకు సెలవుల జాబితా
3 జూలై 2025- ఖర్చీ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి
5 జూలై 2025- గురు హర్‌గోబింద్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి
6 జూలై 2025- ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
12 జూలై 2025- నెలలో రెండో శనివారం దేశంలోని అన్ని బ్యాంకులకు హాలిడే
13 జూలై 2025- ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులకు వారాంతపు సెలవు
14 జూలై 2025- బెహ్ దీంక్లాం కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
16 జూలై 2025- హరేలా పండుగ కారణంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి
17 జూలై 2025- ఉ తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
19 జూలై 2025- కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు హాలిడే
20 జూలై 2025- ఆదివారం వారాంతపు సెలవు
26 జూలై 2025- ఈ నెలలో నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
27 జూలై 2025- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే
28 జూలై 2025- ద్రుక్పా షె జీ సందర్భంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి
ఆదివారం, రెండో, నాలుగో శనివారం కాకుండా, ఇతర ప్రత్యేక కారణాల వల్ల కూడా బ్యాంకులు మూసివేయబడవచ్చు. బ్యాంకు సెలవు రోజుల్లో, మీరు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకుని మీ ఆర్థిక పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేయడం, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ చేయడం వంటి సేవలు బ్యాంకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -