నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో పని చేయుచున్న ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల జవాబుదారీతనం తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు జవాబుదారీతనం తో సేవలందించాలని, ఉద్యోగులు, సిబ్బంది తప్పక సమయాపాలన పాటించాలని సూచించారు. కార్యాలయాల్లో రికార్డ్ గదులతో పాటు హాజరు రిజిస్టర్స్ లను పరిశీలించారు. సమయానికి రాని సిబ్బందిపై వాకప్ చేశారు, రికార్డ్స్ గదుల్లో సరైన రీతిలో రికార్థులను ఉంచాలని అలాగే అన్ని కార్యాలయాలను ఎప్పడికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.తనిఖీల్లో భాగంగా రెవెన్యూ, ఎలక్షన్ సెల్, రెవెన్యూ రికార్డ్ రూమ్, డిపిఆర్ఓ , డి టి ఓ, డి ఎం హెచ్ ఓ, డిపిఓ, డి ఆర్ డి ఏ, డి ఎం పౌర సరఫరాలు, డీఎఫ్ఓ, ఉద్యాన తదితర శాఖలను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.