నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆక్కడి ఆరావళి ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మార్వార్ జంక్షన్ ప్రాంతాల్లో వర్షపు కాలువలు ప్రవహించాయి. వర్షం కురుస్తున్న సమయంలో ఓ యువకుడు బైకుపై వస్తుండగా వరద ప్రవాహం ఎక్కువ అవ్వడంతో బైకు అదుపు తప్పడంతో.. బైక్ను ఆపేందుకు యత్నిస్తుండగా కొట్టుకుపోయాడు. కొంతమంది యువకులు తమను తాము రక్షించుకోవడానికి ప్రవహించే నీటిలోకి పరుగులు తీశారు.