లక్ష్మారెడ్డి సేవలు మరవలేనివి: రాజ్ కుమార్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గిరిజన సంక్షేమ శాఖకు కడారు లక్ష్మారెడ్డి చేసిన సేవలు మర్చిపోలేనివని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్ కడారి లక్ష్మారెడ్డి పదవి విరమణ సన్మాన సభ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిటిడబ్ల్యూఓ రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత 32 సంవత్సరాలుగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రం లోని గిరిజన వసతి గృహ వార్డెన్ గా బాధ్యతలు నిర్వహిస్తు అనేకమంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చి దిద్దిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా ఇంచార్జ్ ఎటిడిఓ ఆయన సేవలు అందించారని కొనియాడారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో   వసతి గృహాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గామయ్య, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు గుంతకండ్ల దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జి. వెంకటరెడ్డి, టిఎన్జీఎస్ జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి, వార్డెన్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి కొల్లు బాలకృష్ణ, రిటైర్డ్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పి. నరోత్తంరెడ్డి, రిటైర్డ్ డిటిడిఓ కే. భూమా, హైదరాబాద్ డిటిడిఓ ఆర్. కోటజీ, సంగారెడ్డి డిటిడిఓ ఎం. ఫిరంగి, రిటైర్డ్ ఏటిడిఓ ఆర్. సత్యనారాయణ, టీఎన్జీవోస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎ. వెంకట్రాంరెడ్డి, ఎం. శ్రవణ్ కుమార్, టి. వెంకటేశ్వర్లు, వార్డెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి. లక్ష్మణ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి, రాము యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ ఏఓ జాఫర్, సీనియర్ అసిస్టెంట్ అతిక్, పార్థసారథి, ముంతాజ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love