మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నంగునూరి నాగన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని పార్ధవ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగారడ్డి భరత్ చందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మృతిచెందర కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. అంతే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కూడా తాను ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందడం బాధాకరమైన తెలిపారు. మృతి చెందిన కుటుంబాన్ని అన్ని రంగాలుగా ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్తను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.