ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం ..

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని వివిధ గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ ,ఎంపీడీవో బాలరాజు, ఎం పి ఓ బండారు పార్థసారథి, ఏ పీ వో మాధవి, ఏపిఎం వరదయ్య, తెలిపారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి కొచ్చర్ల వెంకటేశ్వర్ల తో కలిసి వన మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను బ్రతికించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాటిన మొక్క పెద్దదై రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మొక్క చెట్లుగా ఎదిగి అది మనకు తిరిగి ఆక్సిజన్ అందించి మనల్ని కాపాడేందుకు అంతగా కృషి చేస్తుందని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఆయా పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులతో కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు మహేందర్, సురేష్, రామానుజన్, పద్మ, వెంకన్న, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నాగమణి, వివోఏలు సరిత, స్వప్న ,నాసిహత్ బేగం , కారోబార్ రవి రమేష్ ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love