గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు పై అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజు అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించాలని, త్రాగునీరు సప్లై చేసే వాటర్ ట్యాంకర్ దగ్గర, పైప్ లైన్ల దగ్గర ఎలాంటి లీకేజీ లేకుండా ప్రతిరోజు ట్యాంకులు శుభ్రపరిచి త్రాగునీరు సరఫరా చేయాలని ఎంపీడీఓ రవీందర్ సూచించారు. సోమవారం డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీఓ రవీందర్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు చేందిన కార్యదర్శులతో, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవీందర్ మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించబోయే వన మహోత్సవ కార్యక్రమం పై పలు సూచనలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఉపాధి హామీ ఎపిఓ సుధాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు,నిట్టు కిషన్ రావు,బి కవిత, నరేష్, దివ్య,ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, మెట్లు పాల్గొన్నారు.