– నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణి లో ప్రజలు అందచేసిన అర్జీలపై తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఆదనవు కలెక్టర్ బి.ఎస్. లతతో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో డివిజన్, మండల స్థాయిలో ప్రజలు వివిధ సమస్యలపై చేసుకున్న దరఖాస్తులలో పరిష్కారం కానీ దరఖాస్తు దారునికి ఎందుకు చేయలేకపోయామో వివరాలు తెలపాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ మొదలైనందున రైతులకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదేవిదంగా చివ్వేంల మండలం మున్య నాయక్ తండాకు చెందిన వికలాంగురాలు ధరావత్ పద్మ రెండుపడకల ఇల్లు కై దరఖాస్తు పట్టుకొని ఉండగా స్వయంగా కలెక్టర్ తనదెగ్గరికి వెళ్లి దరఖాస్తు స్వీకరించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖ కు 67 దరఖాస్తులు, డి.పి.ఓ 06, ఇరిగేషన్ 05, డిఆర్డీఓ 04, మెడికల్ 04 అలాగే ఇతర శాఖల దరఖాస్తులు 21 మొత్తం107 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం చాల ముఖ్యమైనదని ఆదికారులు అశ్రద్ధ వహించకుండ సమస్య లను వేంటనె పరిష్కరించాలని కలేక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డి యఫ్ ఒ సతీష్ కూమార్, జెడ్పి సి.ఈ. ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డి.పి.ఓ సురేష్ కుమార్, సి.పి.ఓ కిషన్, డిఎంహెచ్ఓ డా. కోటాచలం, డిటిడిఓ శంకర్, డీఈవో ఆశోక్, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.