డీఈఓపై చర్యలు తీసుకోవాలి: జర్నలిస్టులు

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రైవేటు పాఠశాలల అక్రమాలను దృష్టికి తీసుకవెళ్ళిన స్పందించని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా జర్నలిస్టులు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. చివ్వెంల మండలం బీబీగూడెంలో అనుమతులు లేకుండా శ్రీ చైతన్య పాఠశాలను నడుపుతున్నారని, నిర్మాణంలో ఉన్న భవనంలో పాఠశాల నిర్వహించడంతో విద్యార్ధులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు జర్నలిస్టులు దృష్టికి తీసుకొని రాగా ఈ విషయం వారు డిఈవో కు తెలిపారు. కాని డిఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించంతో పాటు పాఠశాల యాజమాన్యంకు సమాచారం చేరవేసినట్లు తెలయడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, టై, బెల్టులు, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారని డీఈవోకి తెలిపారు. ఈ యొక్క పాఠశాలలో కూడా అమ్మడానికి పర్మిషన్ లేదని ఆయన తెలుపుతున్నారని విషయం పై కలెక్టర్ స్పందించాలని కోరారు.
Spread the love