రైతు భరోసాపై ప్రజల అభిప్రాయ సేకరణ..

– నెల్లికుదురు పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి
– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు
– జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
రైతు భరోసా కార్యక్రమం పై రైతుల అభిప్రాయ సేకరణను సేకరించినట్లు పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం రైతు భరోసా పథకంపై సలహాలు సూచనల కొరకై మంగళవారం ఆ గ్రామ ఎంపీటీసీ వెన్నాకుల వాణి శ్రీనివాస్, జెడిఎ శోభన్ బాబుతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల్లికుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యలో రెవిన్యూ గ్రామాలు బోడ్లాడ బ్రాహ్మణ కొత్తపల్లి నెల్లికుదురు నైనాల చిన్న నాగారం పరిధిలో ఉన్న గ్రామాల రైతులతో నెల్లికుదురు క్లస్టర్ రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో హాజరు అయినా  గ్రామాలకు చెందిన ప్రతి ఒక్క రైతును  రైతు భరోసా పథకం మీద వారి యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని వాటిని రిజిస్టర్లో రాసి ప్రభుత్వానికి అందజేస్తున్నట్ట తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు కొంతమంది మాట్లాడుతూ.. ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా కల్పించాలని మరికొంతమంది రైతులు మాట్లాడుతూ.. కవులు తీసుకున్న వారికి కూడా అవకాశం కల్పించాలని నేరుగా వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొంతమంది రైతులు 10 ఎకరాల వరకు వ్యవసాయ సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని అన్నారు. ఈ విధంగా రైతుల నుండి ఒక్కొక్కరిగా రైతు భరోసా పై అభిప్రాయాలు సలహా సూచనలు తీసుకొని రిజిస్టర్లో నమోదు చేసుకుందామని తెలిపారు. వీటిని పై అధికారులకు పంపిస్తామని అన్నారు. రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందాలంటే వ్యవసాయ శాఖ ఆలోచనలు తీసుకొని వ్యవసాయం చేసినట్లయితే మీకు ఎంతో లాభం చేకూరుతదని అన్నారు. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసమే ఈ రైతు వేదికలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ సమస్య వచ్చినా మీకు సంబంధించిన ఏఈఓ కు తెలిపినట్లైతే ఆ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బాలాజీ నాయక్, మోహన్ మరిపెడ డివిజన్ ఏడిఏ శోభన్ బాబు, నెల్లికుదురు మండల వ్యవసాయ అధికారి రవీందర్,  ఏఈఓ ప్రవీణ్, సీఈఓ మందారపు యాదగిరి, సిబ్బంది శ్రీనివాస్ యాకన్న పూర్ణ మహేష్ మరియు రైతులు పాల్గొన్నారు.

Spread the love