విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి: లింగంపల్లి దయానంద్ 

నవతెలంగాణ – నెల్లికుదురు 
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దయానంద్ అన్నాడు మండలంలోని మునిగిలవీడు హై స్కూల్లో ప్రధానోపాధ్యాయూరాలు నాగనబోయిన స్వప్న తో కలిసి జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు దేశెట్టి యాకన్న ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి శాస్త్రి ఆలోచనను, శాస్త్రీయ దృక్పథాన్ని ,శాస్త్రీయ ఆలోచనను కలిగి ఉండి మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని అన్నారు  మనల్ని పట్టిపీడిస్తున్న అనేక మూఢనమ్మకాల గురించి విద్యార్థులకు అనేక ఉదాహరణలతో వివరించారు. మన ఎదుగుదలకు ప్రతి బంధకాలుగా ఉన్న మూఢనమ్మకాలను విస్మరించాలని దేనిని గుడ్డిగా నమ్మకూడదని తెలిపాడు ఎందుకు? ఏమిటి ?ఎలా? అని ప్రశ్నించుకొని ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి గ్రామాలలో జరిగిన అనేక మూఢనమ్మకాల సంఘటనల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం వాటికి సమాధానాలు ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వప్న జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు దేశెట్టి యాకన్న ఉపాధ్యాయులు  రామ్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, రామస్వామి, మురళీకృష్ణ, సుదర్శన్, భవాని, యాకన్న, రంజిత్ కుమార్, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love