గత 30ఏళ్లుగా అనేక సామాజిక మానవతా ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఉందని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు రాజన్న మాదిగ అన్నారు.ఆదివారం ఎం ఆర్ పి ఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాల్టీ ఆఫీస్ వద్ద ఎమ్మార్పీఎస్,ఎంఎస్ నియేజకవర్గ ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ అద్యక్షతన జరిగిన ఆవిర్భావం మంద కృష్ణ మాదిగ పుట్టిన రోజు వేడుకలకు ఘనంగా నిర్వహించి ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల కుట్రలను చేదిస్తు, ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ, స్వార్థపరుల కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏండ్లుగా సజీవంగా నిలబడిందంటే మంద కృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణమని అన్నారు.76యేండ్ల స్వతంత్ర్య భారతదేశంలో సుదీర్ఘంగా నడుస్తున్న అతి పెద్ద ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని అన్నారు. ఇన్ని ఏండ్ల పోరాటంలో మాదిగ జాతికి ఆత్మగౌరవం, అస్థిత్వం, గుర్తింపుతో పాటు మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా 25 వేల ఉద్యోగాలను ఎమ్మార్పీఎస్ అందించిందని అన్నారు.అనంతరం మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ నియోజవర్గం ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ, ఎం ఎస్ పి నాయకులు ఎర్ర వీరాస్వామి మాదిగ,ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జసైదులు మాదిగ, ఎం ఎం ఎస్ నాయకురాలు మారేపల్లి సావిత్రి ప్రభాకర్ మాదిగ,నాయకులు బోడ శ్రీరాములు మాదిగ, దాసరి వెంకన్న,ములుగురి రాజు మాదిగ,వెంకటాద్రి ,మిర్యాల చిన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.