స్టాకహేోమ్: పేరెంటల్ లీవ్ ఇంతవరకు తల్లిదండ్రులకే లభించడం చూశాం. ఇప్పుడు తాతలు కూడా పేరెంటల్ లీవ్ పొందే సౌకర్యం కల్పించింది స్వీడెన్ ప్రభుత్వం. పేరెంటల్ లీవ్‌లో ఉదారంగా ఉండే స్వీడన్ ఇప్పుడు మరింత ఉదారంగా వ్యవహరించింది. పసి పిల్లలను చూసుకునే తల్లి దండ్రులకు ప్రభుత్వం ఇచ్చే 16 మాసాలపాటు వేతనంతో కూడిన పేరెంటల్ లీవ్‌ను తల్లి దండ్రులిరువురూ షేర్ చేసుకోవడానికి మాత్రమే ఇప్పటివరకు అనుమతించేవారు. ఈ నెల ఒకటి నుంచి ఈ పేరెంటల్ లీవ్స్‌లో తల్లిదండ్రులకు మాత్రమే కాకుండూ మూడవ పార్టీకి కూడా కేటాయించుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. తల్లి 45 రోజులు, తండ్రి 45 రోజులు మొత్తం మీద 90 రోజుల దాకా పేరెంటల్ లీవ్స్‌ను తాతలకు, లేదా అత్త మామలకు, ఇంట్లో పిల్లల బాగోగులు చూసుకునే ఎవరికైనా ఆ తల్లి దండ్రులు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఈ మేరకు స్వీడన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.