- Advertisement -
పోకో ఎఫ్7 విడుదల
నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్లలో ఒక్కటైన పోకో తన ఎఫ్-సిరీస్‌లో భారీ బ్యాటరీ సామర్థ్యంతో కొత్తగా పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గురువారం హైదరాబాద్ లో దీనిని పోకో ప్రొడక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ దేవ్ ఆవిష్కరించారు. ఈ ఫోన్‌ను 7550 ఎంఎహెచ్ బ్యాటరీతో అందుబాటు లోకి తెచ్చా మన్నారు. ఇందులో ప్రధానంగా సోనీ 50ఎంపి కెమెరాను అమర్చా మన్నారు. 12జిబి ర్యామ్, 256 మెమోరీ వేరియంట్ ధరను రూ.29,999గా, 12జిబి, 512 జిబి ధరను రూ.31,999గా నిర్ణ యించామన్నారు. జులై 1న ఫ్లిప్ కార్ట్‌లో సేల్‌ను ప్రారంభించ నున్నట్టు వెల్లడించారు.
- Advertisement -