Thursday, September 10, 2026
E-PAPER
Homeబీజినెస్రైతుల కొరకు అధునాతన కీటకనాశిని  CARVINTను తెచ్చిన PI ఇండస్ట్రీస్

రైతుల కొరకు అధునాతన కీటకనాశిని  CARVINTను తెచ్చిన PI ఇండస్ట్రీస్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నూతన తరానికి చెందిన ఒక అధునాతన  కీటకనాశిని CARVINT (ఫ్లొమిటోక్విన్ 10% SC) ని ప్రారంభిస్తున్నామని  PI ఇండస్ట్రీస్ నేడు ప్రకటించింది. మిరప, క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ వంటి పంటల్లో తామర పురుగులు మరియు డైమండ్ బ్యాక్ మాథ్ (DBM)ను ప్రభావవంతంగా నియంత్రించడానికి ఇది రూపొందించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కీలక మార్కెట్లపై  ప్రత్యేక దృష్టి సారించి ప్రభావవంతమైన మరియు సుస్థిర కీటక-యాజమాన్య పరిష్కారాలను కోరుకుంటున్న ప్రగతిశీల రైతులకు విలక్షణమైన చర్యా విధానం మరియు దీర్ఘకాలం అవశేషాల నియంత్రణతో, CARVINT ఒక కొత్త పరికరంగా నిలుస్తుంది .

కూరగాయల రైతుల కి , ముఖ్యంగా అత్యధిక విలువ కలిగిన మిరప మరియు కోలే ( క్యాబేజీ మరియు కాలీఫ్లవర్) వంటి పంటలకు  కీటకాలు అతి పెద్ద సవాలుగా  మారింది . తామర పురుగులు మిరప దిగుబడులను 25–50% తగ్గిస్తాయి, డైమండ్ బ్యాక్ మాథ్ క్యాబేజీలో గణనీయమైన నష్టాలను కలిగిస్తాయి. తరచుగా పిచికారీలు చేయడం, స్వల్పకాలం నియంత్రణ, పెరుగుతున్న ఖర్చులు మరియు ప్రస్తుతం ఉన్న రసాయనాలకు పెరుగుతున్న నిరోధకత వంటి సవాళ్లను కూడా రైతులు ఎదుర్కొంటున్నారు.

CARVINT ఈ సవాళ్లను ఒక కొత్త సక్రియ పదార్థం అనగా ఫ్లోమిటోక్విన్ 10% SC ద్వారా పరిష్కరిస్తుంది. ఇది IRAC గ్రూప్ 34కి చెందినది. ఇది భారతదేశపు మార్కెట్ల కు ఒక కొత్త  శ్రేణికి చెందిన కీటకనాశిని. ఇది కీలకమైన కీటకాల కోసం విభిన్నమైన ఎంపికను రైతులకు  అందిస్తుంది మరియు ఇప్పటికే ఉన్న కీటకనాశిని రసాయనాలతో  మార్పిడి  విధానం ద్వారా నిరోధకత -యాజమాన్యo   కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది.

ఈ ప్రారంభోత్సవం గురించి వ్యాఖ్యానిస్తూ, శ్రీ సాకేత్ భట్నాగర్, సీఈఓ ఇండియా బ్రాండ్స్, పిఐ అగ్సైన్సెస్ (Mr. Saket Bhatnagar, CEO India Brands, PI AgSciences), పెరుగుతున్న కీటకాల నిరోధకత, తరచు పిచికారీ చేయవలసిన ఆవశ్యకతలు, స్వల్పకాలం నియంత్రణ మరియు పెరుగుతున్న పంట-యాజమాన్య ఖర్చులు వంటి సమస్యలను నేడు రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రభావవంతమైన మరియు సుస్థిరమైన కీటక యాజమాన్యం కోసం ఒక వినూత్నమైన  చర్యా విధానo కలిగిన CARVINT ని రైతులకు ఒక పరికరంగా అందజేస్తోంది . దీని కొత్త చర్యా విధానం నిరోధక- నిర్వహణ  కార్యక్రమాలలో  ఉపయోగకరం మరియు రైతులకి బాధ్యతాపూర్వకంగా మార్పిడి పద్ధతి లో పురుగుమందులు వాడడానికి అనుకూలం.  CARVINTవంటి ఆవిష్కరణలు ద్వారా, క్రొత్తగా ఎదురు అవుతున్న సవాళ్లను పరిష్కరించి తమ పంటలను మరింత ప్రభావవంతంగా నిర్వహించడంలో రైతులకు మద్దతు చేసే భారతదేశపు వ్యవసాయానికి విభిన్నమైన పరిష్కారాలను తీసుకురావడానికి మేము కట్టుబడ్డాము.

ఈ ప్రారంభం అనేది PI ఇండస్ట్రీస్ వారి  విభిన్న రకాల  వ్యవసాయ పరిష్కారాల జాబితాలో మరో చేరిక . CARVINT ప్రారంభంతో, తమ వినూత్నమైన పంట- రక్షణ మరియు వ్యవసాయ పరిష్కారాలు యొక్క జాబితా విస్తరణను PI కొనసాగిస్తోంది.   దీని యొక్క ఒక కొత్త చర్యా విధానం, లక్షిత  కీటకాల  నియంత్రణ, అవశేషాల పనితీరు  మరియు నిరోధక-నిర్వహణ కార్యక్రమాల కోసం అనుకూలత వలన ,  భారతదేశంలో  అభివృద్ధి చెందుతున్న రైతు సమాజానికి విభిన్నమైన పంట-రక్షణ సాంకేతికతలను తీసుకురావడంలో  PI ఇండస్ట్రీస్   దృష్టి సారించడాన్ని CARVINT సూచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -