Thursday, September 10, 2026
E-PAPER
Homeబీజినెస్జెబ్రోనిక్స్ నుంచి సరికొత్త సౌండ్‌బార్ ధర రూ.69,999.

జెబ్రోనిక్స్ నుంచి సరికొత్త సౌండ్‌బార్ ధర రూ.69,999.

- Advertisement -

చెన్నయ్‌ : దేశీయ టెక్ బ్రాండ్ జెబ్రోనిక్స్ భారత మార్కెట్లో ‘జెబ్ జూక్ బార్ 11000’ పేరుతో 11.2.4 ఛానెల్ ఫ్లాగ్‌షిప్ సౌండ్‌బార్‌ను విడుదల చేసింది. 1610వాట్‌ ఆర్‌ఎంఎస్‌ పవర్ అవుట్‌పుట్‌తో రూపొందించిన ఈ ఆడియో సిస్టమ్‌లో డాల్బీ అట్మాస్, ‌డిటిఎస్‌:ఎక్స్‌ టెక్నాలజీలతో అందించారు. దీని ప్రారంభ ధర రూ.69,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు జెబ్రోనిక్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ లోనూ అందుబాటులో ఉందని తెలిపింది. ఇది భారత్‌లో 11.2.4 ఛానెల్ కాన్ఫిగరేషన్‌తో వచ్చిన తొలి సౌండ్‌బార్ అని ఆ కంపెనీ పేర్కొంది. ఈ సౌండ్‌బార్‌లో 11 హై-పెర్ఫార్మెన్స్ డ్రైవర్లు, డ్యూయల్ 20.32 సెం.మీ సబ్‌వూఫర్ డ్రైవర్లు ఉన్నాయి. సినిమాలు, సంగీతం, గేమింగ్‌లో త్రీడైమెన్షనల్ సౌండ్ అనుభూతిని అందించేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, టీవీ ఇఎఆర్‌‌సి, ఆప్టికల్ ఇన్, యుఎస్‌‌బి, ఎయుఎక్స్‌ వంటి సదుపాయాలు ఉన్నాయని జెబ్రోనిక్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రదీప్ దోషి తెలిపారు. అధునాతన ఆడియో టెక్నాలజీని మరింత మంది భారతీయ వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -