మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాం : టీడబ్ల్యూజేఎఫ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
విధినిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్ ) రాష్ట్ర కమిటీ ఖండించింది., అక్రమంగా కేసు పెట్టదాన్ని తప్పు పట్టింది. అకారణ అరెస్టును నిరసించింది. ఈ మేరకు టీ డబ్లూ జే ఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ తమకు అనుకూలమైన విధానాలను ఎన్డియే ప్రభుత్వం అవలంబించడం దారుణమని విమర్శించారు. ఐదు రోజుల క్రితం ఢిల్లీలో విధినిర్వహణ లో ఉన్న మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళా జర్నలిస్టులు షాహిన్ ఖాన్, నఫీజా ఖాన్ లపై పోలీసులు దాడి చేయడం, వారిని అక్రమంగా అరెస్టు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు అన్నారు. మహిళా జర్నలిస్టులకు న్యాయం చేయడంతో పాటు, ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాల అనాలోచిత విధానాలపై పోరాడటం ద్వారా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటామన చెప్పారు. రాజ్యాంగ హక్కులను మోడీ ప్రభుత్వం కాల రాస్తున్నదని వివరించారు. సమాజాభివృద్ధి లో మీడియా కీలక పాత్ర వహిస్తున్నాదని అన్నారు.
ఢిల్లీ జర్నలిస్టుల పై దాడికి ఫెడరేషన్ ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



