Wednesday, September 9, 2026
E-PAPER
Homeబీజినెస్బంధన్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విడుదల...

బంధన్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విడుదల…

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆర్థిక రంగంలో వినూత్నమైన , సమ్మిళిత సేవలను అందించే లక్ష్యంతో బంధన్ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం నాలుగు సరికొత్త క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేసింది. మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో ముంబై వేదికగా ఈ కార్డులను అధికారికంగా ఆవిష్కరించారు. వినియోగదారుల మారుతున్న ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరిచేలా పూర్తి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియతో వీటిని రూపొందించారు. బ్యాంక్ లోగోలోని నిరంతర జ్వాల స్ఫూర్తితో స్పార్క్స్, ఇగ్నైట్, ఫ్లేర్ , లూమినా అనే పేర్లతో నాలుగు వేరియంట్లను ప్రవేశపెట్టారు.

నాలుగు వేరియంట్లు…

ఈ కొత్త క్రెడిట్ కార్డులు జెన్ జీ మొదలుకొని ప్రీమియం లైఫ్‌స్టైల్ కోరుకునే వారందరి అవసరాలను తీర్చేలా ఉన్నాయి. స్పార్క్స్ కార్డ్ కిరాణా, దుస్తుల కొనుగోళ్లపై రివార్డులు, బుక్‌మైషో ఆఫర్లు, దేశీయ లాంజ్ ప్రవేశం, ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపును, ఈఎంఐ క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. ఇగ్నైట్ కార్డ్ ప్రయాణ, కిరాణా ఖర్చులపై అధిక రివార్డులతో పాటు అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్, ఈజీడైనర్ ప్రయోజనాలు అందిస్తుంది. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఫ్లేర్ కార్డ్‌లో అమెజాన్ పే వోచర్, దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల లాంజ్ ప్రవేశం, బుక్‌మైషో, ఈజీడైనర్ ప్రయోజనాలతో పాటు గోల్ఫ్ సదుపాయాలు ఉంటాయి. అత్యుత్తమ సేవలు కోరుకునే వారి కోసం తెచ్చిన లూమినా కార్డ్ అంతర్జాతీయ ఖర్చులపై ప్రీమియం రివార్డులు, ఒబెరాయ్ గిఫ్ట్ వోచర్, ఎయిర్‌పోర్ట్ కన్సియర్జ్ , మీట్ అండ్ గ్రీట్ సేవలను అందిస్తుంది.

భాగస్వామ్య ప్రాముఖ్యత..

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా, మాస్టర్‌కార్డ్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్, ఈడీ రాజిందర్ కుమార్ బబ్బర్, క్రెడిట్ కార్డ్స్ హెడ్ పీయూష్ ఝా తదితరులు పాల్గొన్నారు. సేన్‌గుప్తా మాట్లాడుతూ, సమగ్ర బ్యాంకింగ్ సేవల దిశగా ఇది ఒక కీలక మైలురాయి అని, డిజిటల్ ఇండియా ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. కస్టమర్ల ప్రయాణంలో ప్రతి దశలోనూ ఇవి ప్రయోజనాలు అందిస్తాయన్నారు. ఈ సందర్భంగా బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ రాజిందర్ కుమార్ బబ్బర్ మాట్లాడుతూ, “మా క్రెడిట్ కార్డుల ఆవిష్కరణ బంధన్ బ్యాంక్ కస్టమర్-కేంద్రిత ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముఖ్యమైన అడుగు. విభిన్న రకాల ఖర్చు అవసరాలు మరియు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పోర్ట్‌ఫోలియో ద్వారా డిజిటల్ సౌలభ్యం, విలువైన రివార్డులు మరియు సంబంధిత లైఫ్‌స్టైల్ ప్రయోజనాలను ఒకే చోట అందిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న క్రెడిట్ కార్డ్ ఎకోసిస్టమ్‌లో మా ఉనికిని విస్తరిస్తూ, మా కస్టమర్లకు మరింత విలువను అందించేందుకు మేము ఎదురుచూస్తున్నాము.” గౌతమ్ అగర్వాల్ మాట్లాడుతూ, బంధన్ బ్యాంక్ నెట్‌వర్క్ , మాస్టర్‌కార్డ్ సాంకేతికత కలయికతో నేటితరం కస్టమర్లకు సురక్షితమైన , ఆకర్షణీయమైన చెల్లింపు అనుభవాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ క్రెడిట్ కార్డుల కోసం వినియోగదారులు నేరుగా సమీప బ్రాంచ్‌ను సందర్శించవచ్చు లేదా బ్యాంక్ వెబ్‌సైట్(https://applycc.bandhan.bank.in) ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 35 చోట్ల విస్తరించి ఉంది. 6,400కు పైగా బ్యాంకింగ్ కేంద్రాల ద్వారా 3.2 కోట్ల మంది కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తూ తన వృద్ధిని కొనసాగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -