సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి– శంకర్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి రేవతి
నవతెలంగాణ-శంకర్‌పల్లి
సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి రేవతి అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ జి. శ్రీనివాస్‌తో కలిసి మున్సిపల్‌ కార్యాలయంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు మున్సిపల్‌ సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సీజనల్‌ వ్యాధులు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్‌లో స్ప్రే ఆపరేషన్‌ చేపట్టడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ కేంద్రంతో పాటు పరిధిలోని అన్ని కాలనీలలో పాగింగ్‌ చేయాలన్నారు. చిన్న చిన్న కాలనీలో చుట్టుపక్కల పిచ్చి మొక్కలు మొలవడంతో అక్కడ దోమలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ కూడా ఫాగింగ్‌ చేస్తే బాగుంటుందని అన్నారు. వర్షాకాలం దుష్ట దోమలు ఎక్కువగా స్వహవీరం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దోమలు వద్ధి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు శానిటేషన్‌ ప్రతి నీటిలో వాలంటీర్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజల అవగాహన పెంచాలని అన్నారు. కమిషనర్‌ జి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ సిబ్బంది సీజనల్‌ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని కాలనీలలో సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ అంజనీ కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love