కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం, రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యలను వేంటనే పరిష్కరించాలని జులై 10 రోజున దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే లో భాగంగా ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద (అశా కార్యకర్తలు సీఐటీయూ అనుబందం) అద్వర్యంలో నిరసన, ఆందోళన నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆసుపత్రి ఇంచార్జీ వైద్యాధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు రాచకొండ విగ్నేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బోడిగే స్వప్న మాట్లాడుతూ అశాల కోరికలైన దీర్ఘకాలికమైన సమస్య అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనీస వేతనం 26,000 అందించాలని, అదేవిధంగా ఫిక్స్డ్ వేతన చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని అన్నారు. గత 18 ఏళ్ళుగా ఆశలు ప్రజలకు నిర్విరామంగా గ్రామాల్లోనే ఉంటు వారికి రెయింబవళ్ళు సేవ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేయకపోవడం బాధాకరమన్నారు. ఆశాలకు టీఏ, డీఏలు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం స్కీంకు బడ్జెట్ పెంచి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని, దాంతోపాటుగా ఆశాలకు నష్టం కలిగించే పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ప్రతినెల పదివేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కేమ్ వర్కర్ల అందరికీ పే కమిషన్ ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను పరిష్కారం చేయాలని లేనిచో భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మంజుల, గంగ లక్ష్మీ, రూక్సన, రేణుక, పాశం జ్యోతి, నిర్మలా, పద్మా,లక్ష్మి, సరిత, అరుణా, తదితర నాయకులు పాల్గొన్నారు.