డిచ్పల్లిలో ఘనంగా జగన్నాథ రథయాత్ర…

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇస్కాన్ (నిజామాబాద్) ఆధ్వర్యంలో  డిచ్పల్లి మండల కేంద్రంలోని శ్రీకాశీవిశ్వనాథాలయం వద్ద బుధవారం శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు సిద్ద బలరాందాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తిమార్గంలో నడుచుకోవాలన్నారు. జగన్నాథుడిని దర్శించుకుంటే మానవుడికి పునర్జన్మ ఉండదన్నారు. జగన్నాథ రథయాత్ర విశిష్టత గురించి వివరించారు. ఈ యాత్ర స్థానిక శివాలయం నుంచి బస్టాండ్, మార్కెట్, రైల్వేస్టేషన్ ఏరియా మీదుగా దేవాలయం వరకు చేరుకున్నది. దారివెంట భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. . ఆ సందర్భంగా భజన, కీర్తనలు, కోలాటలు. భక్తి కార్యక్రమాలను నిర్వహించారు. నిర్వహకులు డాక్టర్ అశోక్, జ్ఞానేశ్వర్, రాజారాం, చెంచురెడ్డి, దామోదర్, రాందాసు, కమిటి బృందం, భారీ సంఖ్యలో భక్తులు హజరయ్యారు.
Spread the love