సూర్యాపేట జిల్లా బాలేంలలోని అరవిందాక్ష కాలేజీ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ విద్యార్థులకు మెనూ పాటించకపోవడం వల్ల నాణ్యమైన భోజనం అందించాలని అడిగిన విద్యార్థినిలను టార్గెట్ చేసుకోని వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ ను ట్రన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలని విద్యార్థులు బుధవారం బాలెంల స్టేజి నుండి కలెక్టర్ కార్యాలయం వరుకు ర్యాలీ గా వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులకు పిడిఎస్ యు విద్యార్థి సంగం మద్దతు ప్రకటించారు.ఈ సందర్బంగా పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు సరైన వసతులు లేవని ప్రిన్సిపాల్ ని అడిగితే మీకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తా అని బెదిరింపులకు గురిచేస్తుంది.తక్షణమే ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని అన్నారు. ఆర్ సి ఓ అరుణ కుమారి జిల్లాలోని గురుకుల కళాశాల, పాఠశాలల ప్రిన్సిపాల్ తో కుమ్మక్కై విద్యార్థులు చనిపోతున్న, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా, ప్రిన్సిపాల్ లకు కొమ్ముగాస్తున్నది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రిన్సిపాల్ శైలజని సస్పెండ్ చేసి ఆర్ సి ఓ అరుణ కుమారి పై చర్యలు తీసుకొవాలి అని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం సరైనది కాదు అని అన్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కానీ విద్యార్థుల సమస్యలు మారడం లేదు. సరియైన సదుపాయం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణం మౌతుంది తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పూల్లూరి సింహద్రి డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ తదితరులు పాల్గొన్నారు.