బీఆర్ఎస్ ఉనికి కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఆరోపణలు

Allegations on MLC Jeevan Reddy for existence of BRS– ప్రభుత్వం మారితేనే ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయా 
నవతెలంగాణ – రాయికల్
గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడేండ్లు గడిచిన పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక ప్రజల సమస్యలు గుర్తుకు వస్తున్నాయా అని మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ ప్రశ్నించారు.ఆదివారం బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ పై చేసిన నిందారోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు రాయికల్ జేఏసీ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పట్టణంలో,మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించామని గుర్తు చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 22 ఫిబ్రవరి 2016 సంవత్సరంలో రాయికల్ పట్టణంలో 60 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 16 జూన్ 2017లో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం కోసం అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని,2023 సంవత్సరం వరకు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏడేండ్ల పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించక అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తుందని, అధికారంలో ఉండగా ప్రశ్నించని కౌన్సిలర్లు టిఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగయ్యాక ఉనికి కాపాడుకోవడం కోసం ప్రజల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాయికల్ పట్టణ ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు10 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఫిల్టర్ బెడ్ ను నిర్వీణ్యం చేసి ప్రజలకు శుద్ధ జలం రాకుండా చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో నిరుపయోగం ఉన్న ఫిల్టర్ బెడ్ ను పునః ప్రారంభించేందుకు రూ.4 కోట్ల నిధులను కేటాయించారని గుర్తు చేశారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు గడిచిందని పట్టణంలోని వైకుంఠధామంలో విద్యుత్ లైట్లు లేక కారు చీకట్ల నడుమ  అంత్యక్రియలు చేసిన సౌకర్యాలు కల్పించకపోతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేసి హైమాస్ లైట్లు ను ఏర్పాటు చేశామన్నారు.నియోజకవర్గ పునర్విభజన  అంశంకు సమయం ఉందని నియోజకవర్గం మరీనా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పడు రాయికల్ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్ రెడ్డి, నాయకులు ఎద్దండి దివాకర్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని చిన్న భూమయ్య,పొన్నం శ్రీకాంత్ గౌడ్,మొబిన్,షాకీర్,రాజేష్ సంతోష్,శివ కుమార్ పాల్గోన్నారు.
Spread the love