జిల్లావ్యాప్తంగా 94.6 శాతం వర్షపాతం నమోదు 

– అత్యధికంగా చిట్యాల మండలంలో, అత్యల్పంగా అనుముల మండలంలో నమోదు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 94.6 మిల్లీమీటర్ల సరాసరి  వర్షపాతం నమోదయింది. ప్రస్తుతం వానాకాలమే అయినప్పటికీ వర్షాలు మాత్రం అడపాదడపానే కురుస్తున్నాయి. విత్తనాలు విత్తుకున్న రైతులు వర్షం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1 తేదీ నుండి సోమవారం నాటికి 141.9 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 189.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.  జిల్లా వ్యాప్తంగా చూస్తే పడాల్సిన వర్షానికి 33  శాతం అధిక వర్షపాతం నమోదయింది. ఇప్పటివరకు అత్యధికంగా చిట్యాల మండలం లో 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా  అత్యల్పంగా అనుముల మండలంలో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మండలాల వారిగా వర్షపాతం వివరాలు..
చిట్యాలలో 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం,
శాలిగౌరారం 15.5,నార్కెట్‌పల్లి 15.1,మర్రిగూడ 6.9,గట్టుపల్ 4.5,కట్టంగూర్ 4.3,చింతపల్లి 3.5,
 చండూర్ 3.3,నల్గొండ 2.8,మునుగోడు 2.6,
 తిప్పర్తి 2.3,గుండ్లపల్లి 2.2,గుర్రంపోడ్ 1.8,
 దేవరకొండ 1.8,నాంపల్లి 1.8,కేతేపల్లి 1.7,
 నక్రేకల్ 1.6,మాడుగులపల్లి 1.2,కనగల్ 1.0,
 కొండ మల్లేపల్లి 0.9,చందంపేట 0.8,వేములపల్లి 0.3, త్రిపురారం 0.2,పిఎ పల్లి 0.2,
 అనుముల 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Spread the love