సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ రంజిత్ 

Be vigilant against seasonal diseases: Dr. Ranjith– నర్సాపూర్ లో ఉచిత చిత వైద్య శిబిరం
నవతెలంగాణ – తాడ్వాయి 
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ అన్నారు. మంగళవారం కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల నర్సాపూర్ (పిఏ) లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జ్వర పీడితుల వద్ద రక్త నమూనాల సేకరించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రంజిత్ మాట్లాడుతూ  సకాలంలో సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయని తెలిపారు. చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా వంటి సీజన్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువ గా వస్తాయని అశ్రద్ధ చేస్తే ప్రాణాపా సంభవించే అవకాశం ఉందని, ఈ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశాల పరిశుభ్రత పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని సేవించాలన్నారు. మురుగునీరు ఎక్కువ నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ సమ్మయ్య, ఎమ్మెల్యే స్పీచ్ ఎండి ఆస్పియా, ఏఎన్ఎం  రాజేశ్వరి, చంద్రకళ, హెల్త్ అసిస్టెంట్లు ముత్తయ్య, ఆశాలు జయ సుధ, రామ తదితరులు పాల్గొన్నారు.
Spread the love