– సికింద్రాబాద్కు చెందిన జై అశోక్ జయశ్రీ, కుటుంబసభ్యుల పిటిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గండిపేట మండలం కోకాపేటలోని తమ భూమిని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్కు చెందిన జై అశోక్ జయశ్రీ ఇతర కుటుంబసభ్యులు పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ లక్ష్మణ్.కె విచారించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. కౌంటర్ వేయాలని ఆదేశించారు. కోకాపేటలో సర్వే నెం 230, 240లో 11 ఎకరాల కేటాయింపును రద్దు చేయాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. నవాబ్ నుస్రత్ జంగ్1 నుంచి వారసుల పవర్ ఆఫ్ అటార్నీ పొందిన కృష్ణమూర్తి ద్వారా తమ వంశీయులు 1967లో కొన్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా తమ భూమికి బీఆర్ఎస్కు కేటాయించిందన్నారు.