నవతెలంగాణ-హైదరాబాద్: విక్రమార్కుడు సినిమాలో ఏరా..సత్తి బాల్ లోపల పడిదా..అనే డైలాగ్ రవితేజకు మహా కోపం తెపించిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆ పిల్లాడిని కొట్టడం..పిల్లలంతా తమ అమ్మలను తీసుకొని రావడం…ఆ ఆడవాళ్ల చేతిలో హీరోకు జీతాంతా జీతాతా అవుతుంది. ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు అంటారా..?
ఆ సన్నివేశంలో నటించిన బాలనటుడు రవి రాథోడ్ బాల నటుడిగా 50కి పైగా చిత్రాల్లో నటించాడు. ‘విక్రమార్కుడు’లో ఓ సరదా సీక్వెన్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తన దీనగాథను చెప్పుకొచ్చాడు. అవకాశాల వేటలో తాను అలసిపోయానని, సెట్ వర్క్స్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నానని, స్నేహితులతో కలిసి ఉంటున్నానన్నాడు.
” నిన్ను కొట్టను.. తిట్టను.. నువ్వు అస్సలు భయపడకు.. మళ్లీ తిరిగి నన్ను కలువురా.. నిన్ను చూడాలి ” అంటూ రాఘవ లారెన్స్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. విక్రమార్కుడు సినిమాలో బాలనటుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించిన రవి రాథోడ్ సెట్ వర్క్స్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. రవి రాథోడ్ బాల నటుడిగా 50కి పైగా చిత్రాల్లో నటించాడు. ‘విక్రమార్కుడు’లో ఓ సరదా సీక్వెన్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అవకాశాల వేటలో తాను అలసిపోయానని.. అందుకే సెట్ వర్క్స్ చేస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి చెందారని.. స్నేహితులతో కలిసి ఉంటున్నానన్నాడు.
అనంతరం సినీ హీరో రాఘవ లారెన్స్ గురించి మాట్లాడారు. ” లారెన్స్ గారు చాలా మంచివారు. ఆయన నన్ను దత్తత తీసుకొని స్కూల్లో చేర్పించారు. కానీ నేను స్కూల్ నుండి తప్పించుకున్నాను. ఇప్పుడు నేను లారెన్స్ గారికి కనిపిస్తే నన్ను తిడతారో. కొడతారో ” అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో … ఇది కాస్త లారెన్స్ దగ్గరికి చేరింది.
అయితే ఈ వీడియో చూసి తన సోషల్ మీడియా ఖాతాలో రాఘవ లారెన్స్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ” రవి నేను నిన్ను కొట్టనురా.. తిట్టనురా.. మళ్ళీ తిరిగి రారా.. నువ్వు తప్పిపోయాక చాలా రోజులు నేను వెతికాను. ప్రస్తుతం ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చూసి నా గుండె తరుక్కుపోతుంది.. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది.. నువ్వు పారిపోయినందుకు నిన్ను కొట్టను.. తిట్టను.. నువ్వు అస్సలు భయపడకు.. మళ్లీ తిరిగి నన్ను కలువురా.. నిన్ను చూడాలి ” అంటూ రాఘవ లారెన్స్ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు.