నవతెలంగాణ కంఠేశ్వర్
ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వేతన జీవులకు ఈ బడ్జెట్ లో నన్న కొంత ఊరట దక్కుతుందని ఆశించారు. ఐటీ స్లాబులను సవరించాలని, స్టాండర్డ్ డిడక్షన్ కనీసం లక్షకు పెంచాలనేది ప్రధాన డిమాండు. పన్ను మినహాయింపును ప్రస్తుతం మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడంతోపాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని ఆశించారు. తద్వారా వేతన జీవుల చేతిలో మరిన్ని డబ్బులు ఆడతాయని వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింతగా కళకళలాడుతుందని ఆర్థిక నిపుణులు చెప్పారు. సేవింగ్స్ పథకాలను ప్రోత్సహించాలి.80 సీ కింద మినహాయింపు మొత్తం ఒకటిన్నర లక్షల నుండి 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు పెంచలేదు. స్లాబులలో ఎలాంటి మార్పు లేదు. సంపద పన్ను రెండు శాతం విధించినట్లయితే దేశం లో ప్రధాన సమస్యలైన విద్యా, వైద్యం అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉండేది.