నేడు నగరంలో ట్రాఫిక్ మల్లిపు 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం) బోనాల పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నిజామాబాద్  పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. కావున నిజామాబాద్ ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులో గమనించాలని పేర్కొన్నారు. ఈనెల 28న ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఊరపండగ సందర్భంగా ముఖ్యంగ ఊరేగింపు ఖిల్లా చౌరస్తా నుండి సిర్నాపల్లి గడి ( గోల్ హనుమాన్ ), వినాయక్ నగర్, దుబ్బా (జి జి కాలేజ్) వరకు పలుమార్గాలలో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయని వాటి ఎలా వెళ్లాలి ఇలా చేరుకోవాలో మార్గాలను వెల్లడించారు. బోధన్ నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు అర్సపల్లి, న్యూ కలెక్టరేట్, జి జి కాలేజ్, ఫ్లైఓవర్, మీదుగా బస్టాండ్ చేరుకోవలెను, భారీ వాహనాలు న్యూ కలెక్టరేట్ బైపాస్ మీదుగా మాధవ్ నగర్ వెళ్లాలి. బస్టాండ్ నుండి బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్, గ్లామర్, గాంధీచౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్ మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ నుండి బోధన్ వెళ్ళు వాహనాలు మాధవ్ నగర్ బైపాస్, న్యూ కలెక్టరేట్ ,అర్సపల్లి మీదుగా వెళ్లాలి. ఖిల్లా చౌరస్తా నుండి సిర్నాపల్లి గడి (గోల్ హనుమాన్) మార్గంలో వెళ్లేవారు వేరే మార్గాల నుండి వెళ్ళాలి. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తూ తమ ప్రయాణాలు జరుపుకోవాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు.
Spread the love