విద్యార్ధుల్లో సామర్ధ్యాలను పెంపొందించాలి: ఎంఈవో కీసర లక్ష్మి

Skills should be developed among students: MEO Keesara Lakshmi
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధుల్లో అంతర్గతంగా దాగిన సామర్ధ్యాలను వెలికి తీసేందుకు శిక్షణలు దోహదం చేస్తాయని ఈ శిక్షణలు ద్వారా ఉపాధ్యాయులు విద్యార్ధుల్లో సామర్ధ్యాలను పెంపొందించాలని ఇంచార్జి యం.ఇ.ఒ కీసర లక్ష్మి సూచించారు.  జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న “నాస్” శిక్షణ లను మంగళవారం ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్ధులకు  కనీస అభ్యసన సామర్ధ్యాలు పై జాతీయ స్థాయి సర్వే నిర్వహిస్తారని ఈ సర్వే కోసం విద్యార్ధులను సంసిద్ధం ను చేయాలని ఇందుకోసం నిర్దేశించిన ఈ రెండురోజుల శిక్షణా కార్యక్రమాల ద్వారా ఆర్పీ లు అందించిన సలహాలను పాటిస్తూ పాఠశాలలో విద్యార్ధులకు సరైన బోధనను అందించాలని ఆమె అన్నారు.  ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మండల నోడల్ అధికారి,మామిళ్ళ వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్.ఎం ప్రసాదరావు, కాంప్లెక్ష్ ప్రధానోపాధ్యాయులు పి. హరిత,జీహెచ్ఎస్,గుమ్మడి వల్లి ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. వెంకయ్య, వీరేశ్వరరావు, రిసోర్స్ పర్సన్ లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love