న్యూఢిల్లీ : సమగ్ర ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించేందుకు బజాజ్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ తెలిపింది. తన వాణిజ్య వాహన వినియోగదారులు, డీలర్‌షిప్‌లకు భాగస్వామ్యం, ఆర్థిక పరిష్కారాలను అందించనున్నట్లు పేర్కొంది. ఇది తమ మొత్తం వాణిజ్య వాహన శ్రేణిలో ఫైనాన్సింగ్ ఎంపికల సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో చేసుకున్న ఒప్పందమని డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీరామ్ వెంకటేశ్వరన్ తెలిపారు.