మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ నిర్ములన అధికారిని డాక్టర్ దేవి నాగేశ్వరి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక కేంద్రానికి వచ్చిన ప్రతీ ఒక్కరిని టిబి లక్షణాలు గురించి అడగాలని ఎవరైనా దగ్గుతో బాధ పడుతున్నాట్లయితే వెంటనే తెమడ నమూనాలను సేకరించి పరీక్షలు చేయాలని సూచించారు. ఇది అంటువ్యాధి కావున ప్రతీ ఒక్కరు అప్రమత్తం గా ఉంటూ టిబి ని గుర్తించడానికి సహాయపడాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవిగౌడ్, ఘనరాజ్ తదితరులు పాల్గొన్నారు.