ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా

Nizamabad,Telugu news,Navatelangan News,Telangana News– ఇంటి నంబర్ల కేటాయిస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు
– ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు
– చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ-బాన్సువాడ(నసురుల్లాబాద్‌)
బాన్సువాడ డివిజన్‌లో అవినీతి అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా అవుతున్నా.. అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి అనుమ తులు తీసుకోకుండా నేరుగా ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయిస్తున్నారు. శిఖం భూముల్లో సైతం నిర్మాణాలు జరుపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు
నసురుల్లాబాద్‌ మండలంలోని నెమ్లి గ్రామాల్లో ప్రభుత్వ అసైన్డ్‌ భూములకు ఎలాంటి లింకు డాక్యుమెంటు లేకుండానే ఇంటి నంబరు ఇచ్చారు. సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్‌ సైతం చేయించు కొని ఇందులో ఒకటి విక్రయిం చారు. సాయి బాబా ఆలయం ఎదుట ఉన్న కొన్ని ఇండ్ల స్థలం ప్రభుత్వ భూమి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్స్‌ చేసి కొందరు విక్రయించారు. ఎలాంటి ద్రువపత్రాలు లేక పోయినా ఇంటి నంబరు ఇచ్చారు. దీనితో మరో వ్యక్తికి విక్రహించి రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఎలాంటి నివాసం లేక పొయిన తాత్కాలిక రేకుల షెడ్డు చేసిన వాటికి ఇంటి నంబర్‌ కేటాయించడంతో విక్రయ దారులు రిజిస్ట్రేషన్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తు న్నారు. దుర్కి గ్రామాల్లో ప్రభుత్వ భూమిలో రెండు అక్రమ కట్టడాలకు ఇంటి నెంబర్లు ఇచ్చారు.
దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు భూములను కొందరు ఇష్టానుసారం ప్లాట్లు చేసి విక్రయిస్తు న్నారు. బస్వాయి పల్లి శివారు భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి వాటికి ఇంటి నెంబర్లు కేటాయిం చ దాంతో అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్లను సులువు చేసేస్తున్నారు. మరి కొందరు చిన్న గుంటలు చేసి విక్రయిస్తు న్నారు. అందులో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణం చేపడుతు న్నా రు. గతం లో గ్రా మ పంచాయతీకి కేటాయించిన స్థలాలు సైతం విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఇంత తతంగం జరుగుతున్న మున్సిపల్‌ , గ్రామ పంచాయతీ అధికారులు కన్నెత్తి కూడా చూడరని విమర్శలు వస్తున్నాయి.
బాన్సువాడ పట్టణంలో
బాన్సు వాడ మున్సిపల్‌ లో మున్సిపల్‌ కు చెందిన భూమికి రెక్కలు వచ్చాయి. నాల కన్వెన్షన్‌ చెయ్యకుండా, మున్సిపల్‌ నుంచి అనుమతి లేకుండా నిర్మించిన ఇంటికి ఇంటి నంబరు ఇచ్చారని, బీడీ కాలోని వద్ద ఉన్న చెరువు శిఖం భూమిని కొందరు కబ్జా చేస్తూ ప్లాట్స్‌ చేస్తున్నారని ఆరోపణ ఉంది. వరద కాలువలు పూర్తిగా కబ్జా చేశారు. వర్షాకాలం కురసిన వర్షం నీరు వరద కలువ ద్వారా వెళ్ళేది. ఇప్పుడు వరద కాలువలు కబ్జా చెయ్యడంతో వరదనీరు ఇండ్ల లోకి వస్తుంది.
మా దృష్టికి రాలేదు..
సూర్య కాంత్‌ ఇన్‌ఛార్జ్‌ ఎంపీడీఓ
నసురుల్లాబాద్‌
ఖాళీ స్థలాలకు, అక్రమ వెంచర్లలోని ప్లాట్లకు నూతన ఇంటి నెంబర్లు కేటాయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇటీవలే బాధ్య తలు తీసుకున్నా.. మా హయాంలో అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు జరగలేదు. ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే తక్షణ చర్యలు తీసుకుంటాం. భూవ్యాపారులు డీటీసీపీ లేఅవుట్‌తో అనుమతులు పొందాలి. డీటీసీపీ అనుమతులున్న వెంచర్లలో ప్రజలు స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా మోసాలకు తావుండదు.

Spread the love