నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తండ్రి బండ శ్రీహరి మరణించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఆయన ఇంటిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తరక రామారావు సోమవారం సందర్శించారు. శ్రీహరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. బీఎస్ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీహరి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.