
మండలంలోని చేపూరు గ్రామ శివారు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల, పాఠశాలలో గురువారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు నిర్వహించినారు. సందర్భంగా కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవందర్ మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేయడం జరిగింది వారిని స్మరిస్తు వారి త్యాగాలను వృధా చేయనీయవద్దని వారి ఆశయాలు వృధా చేయకుండా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో క్షత్రియ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ కె పాండే వైస్ ప్రిన్సిపాల్ బి నరేందర్ సర్ ఎన్సీస ఏఎన్ఓ లెఫ్ట్ నెంట్ జ్.వెంకటేష్ ,సోషల్ మీడియా ఇంచార్జ్:శృతిన్,అల్ స్టాప్స్ స్టూడెంట్స్ పాల్గొన్నారు క్షత్రియ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి వైస్ ప్రిన్సిపాల్ జోష్నా పాండే ,ఉపాధ్యాయ బృందం ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.