నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ కమాండెంట్ పి. రోహిణి ప్రియదరిని ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కమాండెంట్ పి రోహిణి ప్రియదర్శిని భారతమాత, జాతిపిత మహత్మ గాంధీ చిత్రపటాలకి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్బంగా కమాండెంట్ పి రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం సంపాదించి పెట్టినారన్నారు. వారి త్యాగ నీరతి చిరస్మరణీయమని,అందుకే ప్రతీ ఏటా ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని యావత్ భారత దేశ ప్రజలు ఎంతో ఆడంబరంగా ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు. మనం ఎగురవేసే త్రివర్ణ పతాకంలో ఉన్న మూడు రంగులు స్వేచ్చ, సౌభ్రాతృత్వము, సమానత్వమును సూచిస్తాయని,ప్రతీ భారతీయుడు దేశాభివృద్ధికి తమవంతు కృషి చేస్తూ, దేశం తనకు ఏమి చేసిందని కాకుండా, దేశానికి తాను ఏమి చేశానని ఆలోచించి దేశాభివృద్ధికి తనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా లోని కలెక్టరేట్ లో నిర్వహించిన స్వాతంత్య్ర్య దినోత్సవ వేడుకలలో 7వ బెటాలియన్ సిబ్బంది విశిష్ట సేవాలను గుర్తించి (1. యం.డి సిరాజుద్దీన్, అర్.యస్,ఐ, బి. ప్రసాద్ స్వామి, ఏ.ఆర్.యస్.ఐ , ఎన్ ఉమ్ల , బి. యోగేశ్వర్, పి.సి జి. గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ ) లకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ ఈరావత్రి అనిల్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నాట్లు వివరించారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్స్ కె.పి శరత్ కుమార్, కె.పి సత్యనారాయణ, ఆర్.ఐలు పి. వెంకటేశ్వర్లు, బి. వసంత రావ్, బి. శ్యామ్ రావు, ఆర్. ప్రహ్లాద్, సి. సురేష్, ఆర్.యస్.ఐలు, మినిస్టీరియల్ & మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.