నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష తప్పదు: ఎస్పీ అఖిల్ మహాజన్

Those guilty of crimes must be jailed: SP Akhil Mahajan– మూడు కేసులలో ఎనిమిది మందికి జైలు శిక్ష
నవతెలంగాణ – సిరిసిల్ల
మెమొరి కార్డులో నీలి చిత్రాలు నింపి అమ్మినా ఎస్ ఎస్ ఆర్ సెల్ పాయిట్ యజమాని ఆడెపు రాజుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2000/- వేయిల రూపాయల జరిమానా విధించిన సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ అఖిల్ మహజాన్ పేర్కొన్నారు. ఎస్పీ కథనం ప్రకారం… 09.02.2017 న ఎస్ ఎస్ ఆర్ సెల్ పాయింట్ యజమాని సిరిసిల్ల పట్టణం సుందరయ్య నగర్ కి చెందిన ఆడెపు రాజు అనే వ్యక్తీ మొబైల్ ఫోన్ లో రీచార్జితో పాటు, అధిక లాబాలు ర్జించవలెనన్న దురుద్దేశ్యంతో తన యొక్క కంప్యుటర్ లో నీలి చిత్రాల వీడియోలు డౌన్లోడ్ చేసి తన వద్దకు వచ్చే కస్టమర్లకు మొబైల్ ఫోన్ మెమరి కార్డులలో నింపి డబ్బులు సంపాదించుచున్నాడు.అప్పటి ఎస్.ఐ లియకత్ అలి  సమాచారం అందుకొని కానిస్టేబుల్ రాకేష్ ను మష్టిలో పంపిగా రాకేష్ అతని వద్దకు వెళ్లి షాపు  యజమానికి ఒక మెమొరి కార్డు ఇచ్చి వాటిలో నీలి చిత్రాలు నింపి ఇవ్వమని అడుగగా అతను కానిస్టేబుల్ రాకేష్ వద్ద 100 రూపాయలు తీసుకుని, అతను ఇచ్చిన మెమరి కార్డ్ లో తన కంప్యుటర్ లో నుండి కొన్ని నీలి చిత్రాలు నింపి ఇచ్చినాడు.అ మెమరీ కార్డు ను రాకేష్ తీసుకొని వెళ్ళి  ఎస్.ఐ లికాయత్ ఆలీ కి మెమొరీ కార్డ్  ఇవ్వగా, వెంటనే ఆయన ఆడెపు రాజు ను అదుపులోకి తీసుకొని అతని కంప్యుటర్ ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. విచారణ అనంతరం విచారణ అధికారి  ఐదు మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్  వాదించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఏ. ప్రవీణ్ పూర్వాపరాలు పరిశీలించి నేరస్తుడు అడేపు రాజు కు రెండు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
హత్యాయత్నం కేసులో…
హత్య యత్నం కేసులో రుద్రంగి కి చెందిన  రాగుల బాలకిషన్ , రాగుల దేవయ్య , రాగుల రఘు , అనే ముగ్గురికి  సంవత్సరం సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.100రూపాయల జరిమానాను  న్యాయమూర్తి రాధిక జైస్వాల్ విధించినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. రుద్రంగి గ్రామానికి చెందిన రావుల వెంకటేష్ , రావుల కొండయ్య , రావుల నర్సయ్య , మర్రి తిరుపతి లకు రావుల బాలకృష్ణ, రావుల దేవా, రావుల రఘు లకు చాలా కాలంగా భూమి తగాదాలు ఉన్నందున  27-01-2022  న రావుల వెంకటేష్  పొలంలో కూర్చుని ఉండగా వారి పక్క పొలం కు చెందిన రావుల బాలకిషన్, రావుల దేవ, రావుల రఘు లు  రావుల వెంకటేష్ ను చంపాలనే ఉద్దేశంతో గొడ్డలి తో  దాడి చేయగా రావుల వెంకటేష్ కు తీవ్ర గాయాలు కాగా రావుల కొండయ్య  ఫిర్యాదు మేరకు రుద్రంగి పోలీసులు కేసు నమోదు చేసి రావుల బాలకిషన్ ,రావుల దేవా ,రావుల రఘు లు అప్పటి ఎస్ఐ రిమాండ్ కు తరలించారు.అప్పటి ఎస్ ఐ విజయ్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈకేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.పవన్ వాదించగ  9 మంది సాక్షులను ప్రవేశపెట్టగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులకు సంవత్సరం సాధారణ జైలు శిక్ష తోపాటు ఒక్కొక్కరికి 100 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించరు.హత్య యత్నం కేసులో రుద్రంగి గ్రామానికి చెందిన రాగుల వెంకటేష్ ,రాగుల కొండయ్య , రాగుల నరసయ్య , మర్రి తిరుపతి  అనే నలుగురి పై  నేరం రుజువు కావడంతో ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమాన ను న్యాయమూర్తి రాధిక జైస్వాల్ విధించినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు.
రుద్రంగి గ్రామానికి చెందిన రావుల బాలకిషన్, రావుల దేవ, రావుల రఘు లకు రావుల వెంకటేష్, రావుల కొండయ్య ,రావుల నరసయ్య,  తిరుపతి లకు భూమి తగాదాలు ఉండగా 27-01-2022 న రావుల బాలకిషన్ ,రావుల దేవ, రావుల రఘు ల  పొలం లో పనులు చేసుకొనుచుండగా వారి పక్క పొలం వారు అయిన రావుల వెంకటేష్, కొండయ్య, రావుల నరసయ్య , మర్రి తిరుపతి లు మారణాయుధాలు ధరించి అక్కడికి వచ్చి వారిని చంపాలనే ఉద్యేషంతో వారి పొలాల్లోకి అక్రమంగా చొరబడి మూకుమ్మడిగా దాడి చేసి రావుల వెంకటేష్ రావుల బాలకిషన్ పై పదునైన కత్తితో దాడి చేయగా బాలకిషన్ కు తీవ్ర గాయాలు కాగా భయంతో పరుగులు తీసి రుద్రంగి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసు వారు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపగా రావుల బాలకిషన్  ఫిర్యాదు మేరకు రుద్రంగి పోలీసులు కేసు నమోదు చేసి రావుల వెంకటేష్ రావుల కొండయ్య రావుల నరసయ్య మర్రి తిరుపతి లను అప్పటి సీఐ రిమాండ్ కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈకేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడ్డం లక్ష్మణ్ వాదించగ  11 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష  ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.
సమాజంలో నేరం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు – ఎస్పీ అఖిల్ మహాజన్
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు, ప్రాసిక్యూషన్  వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పై మూడు  కేసులో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ లు గడ్డం లక్ష్మణ్,టి.పవన్,చెలుముల సందీప్, సి ఎం ఎస్  ఎస్.ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ లు  నరేష్,శ్రీనివాస్, సి ఎం ఎస్ కానిస్టేబుల్స్ మధుసూదన్, సిరిసిల్ల టౌన్ సి.ఐ కృష్ణ, చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్.ఐ అశోక్ కుమార్ లను అభినందిస్తున్నట్లు  ఎస్పీ పేర్కొన్నారు.

Spread the love