
కామారెడ్డి పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డిగ్రీ విద్యార్థులు ఏర్పాటు చేసిన తీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. లంబాడ స్టూడెంట్లు ఏర్పాటుచేసిన తీజ్ కార్యక్రమాన్ని చూసి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎవరి పండగలను వారు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం మన దేశ సంస్కృతి అని అన్నారు. తీరు సందర్భంగా ఏర్పాటుచేసిన నృత్య కార్యక్రమంలో పాల్గొని ఆమె నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ చాట్ల వంశీ, తదితరులు పాల్గొన్నారు